1 రాజైన హేరోదు దినములయందు యూదైయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పుదేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి 2 - యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. 3 హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితోకూడ యెరూషలేమువారందరును కలవరపడిరి. 4 కాబట్టి రాజు ప్రధానయాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి - క్రీస్తు ఎక్కడ పుట్టునని వారి నడిగెను. 5 అందుకు వారు - యూదైయ బేత్లెహేములోనే; యేలయనగాయూదైయదేశపు బేత్లెహేమానీవు యూదా ప్రధానులలోఎంతమాత్రమును అల్పమైనదానవు కావుఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతినీలోనుండి వచ్చునుఅని ప్రవక్తద్వారా1వ్రాయబడియున్నదనిరి. 6-7. అంతట హేరోదు ఆ జ్ఞనులను రహస్యముగా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని 8 - మీరు వెళ్లి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేముకు పంపెను. 9 వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువుండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను. 10-11. వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. 12 తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి. 13 వారు వెళ్లినతరువాత ప్రభువు దూత స్వప్నమందు యేసేపుకు ప్రత్యక్షమై- హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవులేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తుకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. 14-15. అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తుకు వెళ్లి ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారాప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణపర్యంతము అక్కడుండెను. 16 ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివరముగా తెలిసికొనిన కాలమునుబట్టి బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను. 17 అందువలన- రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదనధ్వనియు కలిగెను 18 రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మీయా ద్వారాచెప్పబడిన వాక్యము నెరవేరెను. 19 హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపుకు స్వప్నమందు ప్రత్యక్షమై 20 నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్లుము; 21 శిశువు ప్రాణము తీయజూచుచుండినవారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. 22-23. అయితే ఆర్కెలాయు తన తండ్రియైన హేరోదుకు ప్రతిగా యూదైయదేశము ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచే బోధింపబడినవాడై గలిలైయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను. ) Download Audio File
1 ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి 2 - పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదైయ అరణ్యములో ప్రకటించుచుండెను. 3 ప్రభువు మార్గము సిద్ధపరచుడిఆయన త్రోవలు సరాళము చేయుడనిఅరణ్యములో కేకవేయు ఒకని శబ్దముఅని ప్రవక్తయైన యెషయా ద్వారాచెప్పబడినవాడితడే 4 ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారమై యుండెను. 5 ఆ సమయమున యెరూషలేమువారును యూదైయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును అతనియొద్దకు వచ్చి 6 తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. 7 అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి - సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? 8 మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి. 9 అబ్రాహాము మాకు తండ్రి ఆని మీలో మీరు చెప్పుకొన తలచవద్దు; దేవుడు ఈరాళ్ళవలన అబ్రాహాముకు పిల్లలను పుట్టి0పగలడని మీతో చెప్పుచున్నాను. 10 ఇప్పుడే గోడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతిచెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. 11 మారుమనస్సునిమిత్తము నేను నీళ్ళలోమీకు బాప్తిస్మమిచ్చుచున్నాను;అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైన నేనుపాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోనుఅగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. 12 ఆయన, చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి గోధుమలను కొట్టులో పోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని చెప్పెను. 13 ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలైయనుండి యొర్దాను దగ్గరనున్న అతనియొద్దకు వచ్చెను. 14 అందుకు యోహాను - నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింప చూచెను గాని 15 యేను - ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. 16 యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డుకు వచ్చెను; అప్పుడు ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. 17 మరియు - ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. Download Audio File
1 అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపొబడెను. 2 నలువది దినములు దివారాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా 3 ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చి - నీవు దేవుని కూమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. 4 అందుకాయన - మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించునుఅని వ్రాయబడియున్నదనెను. 2 5 అంతట అపవాదిపరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయశిఖరమున ఆయనను నిలువబెట్టి 6 - నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము - ఆయన నిన్నుగూర్చి తన దూతలకాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగలకుండ వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. అని వ్రాయబడియున్నదనిఆయనతో చెప్పెను. 7 అందుకు యేసు -ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరియొకచోటవ్రాయబడియున్నదని వానితో చెప్పెను. 8 పిమ్మట అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోకరాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి 9 నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల ఇవన్నియు నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా 10 యేసు వానితో - సాతానా, పొమ్ము - నీ దేవుడైన ప్రభువుకు నమస్కరించి ఆయనను మాత్రమే సేవింపవలెను. అని వ్రాయబడియున్నదనెను. 5 11 అంతట అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్యచేసిరి. 12 యోహాను చెరలో ఉంచబడెనని యేసు విని గలిలైయకు తిరిగి వెళ్లి 13-16. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలిదేశమును యొర్దాను కావలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలైయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్నవారికి వెలుగు ఉదయించెనుఅని ప్రవక్తయైన యెషయాద్వారాపలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను. ) 17 అప్పటినుండి యేసు - పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడనిచెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. 18 యేసు గలిలైయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. 19-20. ఆయన - నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను; వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 21 ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రియైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసికొనుచుండగా చూచి వారిని పిలిచెను. 22 వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 23 యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలైయయందంతట సంచెరించెను. 24 ఆయన కీర్తి సురియదేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగములచేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువుగలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. 25 గలిలైయ దెకపొలి యెరూషలేము యూదైయయను ప్రదేశములనుండియు యొర్దానుకు అవతలనుండియు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను. Download Audio File
1 ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయనయొద్దకు వచ్చిరి. 2 అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను - 3 ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది. 4 దుఃపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు. 5 సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. 6 నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు. 7 కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు. 8 హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. 9 సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు. 10 నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది. 11 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. 12 సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. 13 మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకేగాని మరి దేనికిని పనికిరాదు. 14 మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు. 15 మనుష్యులు దీపము వెలిగించి కుంచముక్రింద పెట్టరు గాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. 16 మనుష్యులు మీ సత్ క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి. 17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల (వచనముల) నైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. 18 ఆకాశమును భూమియు గతించిపోతేనే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 19 కాబట్టి యీ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో గొప్పవాడనబడును. 20 శాస్త్రుల నీతికంటెను పరిశయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. 21 నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులలో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. 22 నేను మీతో చెప్పునదేమనగా - తన సహోదరునిమీదకోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు సభకు లోనగును;ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. 23 కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన పక్షమున 24 అక్కడ బలిపీఠము ఎదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము అర్పింపుము. 25 నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. 26 కడపటి కాసు చెల్లించువరకు అక్కడనుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 27 వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; 28 నేను మీతో చెప్పునదేమనగా - ఒక స్త్రీని మోహపుచుపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. 29 నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయును; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. 30 నీ కుడిచెయ్యి నిన్ను అభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. 31 తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగపత్రికను ఇయ్యవలెనని చెప్పబడియున్నది గదా; 32 నేను మీతో చెప్పునదేమనగా - వ్యభిచార కారణమునుబట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదాని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. 33 మరియు - నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; 34 నేను మీతో చెప్పునదేమనగా - ఎంతమాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు; ఆకాశము తోడని వద్దు, అది దేవుని సింహాసనము; 35 భూమి తోడని వద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడని వద్దు, అది మహారాజు పట్టణము. 36 నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. 37 మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని యుండవలెను; వీటిని మించునది దుష్టునినుండిపుట్టునది. 38 కంటికి కన్ను పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. 39 నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము. 40 ఎవడైన నీమీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసికొనగోరినయెడల వానికి నీ పై వస్త్రముకూడ ఇచ్చివేయుము. 41 ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల వానితోకూడ రెండు మైళ్లు వెళ్లుము. 42 నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువానినుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. 43 నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; 44 నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించువారికొరకు ప్రార్ధన చేయుడి. 45 ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు. 46 మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా. 47 మీ సహోదరులకు మాత్రమే వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. Download Audio File
1 మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి, లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు. 2 కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 3 నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమ చేతికి తెలియక యుండవలెను. 4 అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 5 మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారులవలె ఉండవద్దు; మనుష్యులకు కనబడెవలనని సమాజమందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 6 నీవు ప్రార్థనచేయునప్పుడు నీ గదిలోకి వెళ్లి తలుపువేసి, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 7 మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు; 8 మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగకమునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియును; 9-10. పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధ పరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక, 11 మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. 12 మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించుము. 13 మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండిమమ్మును తప్పించుము. 2 14 మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. 15 మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. 16 మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారలవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 17 ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. 18 అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 19 భూమి మీద మీకొరకు ధనము కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. 20 పరలోకమందు మీకొరకు ధనము కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. 21-22. నీ ధనమెక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై యుండును. 23 నీ కన్ను చెడినదైతే దేహమంతయు చీకటిమయమై యుండును; నీలో నున్న వెలుగు చీకటియైయుంటే ఆ చీకటి యెంతో గొప్పది. 24 ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. 25 అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమా అని మీ దేహమును గూర్చియైనను, చింతింపకుడి, ఆహారముకంటె ప్రాణమును, వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా? 26 ఆకాశపక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్టులు కారా? 27 మీలో ఎవడు చింతించుటవలన తన యెత్తు మూరెడు ఎక్కువ చేసికొనగలడు? 28 వస్త్రములనుగూర్చి మీరు చింతింపనేల? అడవిపువ్వులు ఏలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు ఒడకవు 29 అయినను తన సమస్త వైభవముతోకూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దానివలెనైను అలంకరింపబడలేదు. 30 నేడు ఉండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. 31 కాబట్టి - ఏమి తిందుమో యేమి త్రాగదుమో యేమి ధరించకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. 32 ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. 33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి; అప్పడవన్నియు మీకనుగ్రహింపబడును. 34 రేపటిని గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును. Download Audio File
1 మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. 2 మీరు తీర్చు తీర్పుచొప్పుననే మిమ్మునుగూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలువబడును. 3 నీ కంటిలోనున్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుట యేల? 4 నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి - నీ కంటిలో నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల? 5 వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. 6 పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చివేయును. 7 అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, 8 తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. 9 మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? 10 చేపను అడిగినయెడల పామునిచ్చునా? 11 మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్యనెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును. 12 కావున మనుష్యులు మీకు ఏమేమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల (ఉపదేశమునై)యున్నది. 13-14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే. 15 అబద్ధ ప్రవక్తలుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొర్రెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. 16 వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్షపండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? 17 ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. 18 మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. 19 మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. 20 కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు 21 - ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. 22 ఆ దినమందు అనేకులు నన్ను చూచి - ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. 23 అప్పుడు - నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారతో చెప్పుదును. 24 కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడు బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి యుండును. 25 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. 26 మరియు ఈ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. 27 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను. 28 యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. 29 ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను. Download Audio File
1 ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. 2 అప్పుడొక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి - ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. 3 అందుకాయన చెయ్యిచాపి వాని ముట్టి - నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తత్క్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. 4 అప్పుడు యేసు - ఎవరితోను చెప్పక నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. 5 ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి 6 - ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. 7 యేసు - నేను వచ్చి వాని స్వస్ధపరచెదననిఅతనితో చెప్పగా 8 ఆ శతాధిపతి - ప్రభువా, నీవు నా యింటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. 9 నేను కూడ అధికారమునకు లోబడినవాడును; నా చేతిక్రింద రాణువవారున్నారు; నేనొకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. 10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచి - ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 11 అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను ఇస్సాకుతోకూడను యాకోబుతోకూడను పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని 12 రాజ్యసంబంధులువెలుపట చీకటిలోకి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను. 13 అంతట యేసు - ఇక వెళ్లుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతనొందెను. 14 తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి 15 ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను; అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. 16 సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. 17 ఆయన మాటవలన దయ్యములను వెళ్లగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను 18 యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్లవలెనని ఆజ్ఞాపించెను. 19 అంతట ఒక శాస్త్రి వచ్చి - బోధకుడా, నీవెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను. 20 అందుకు యేసు - నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుటకైన స్థలము లేదని అతనితో చెప్పెను. 21 శిష్యులలో మరియొకడు - ప్రభువా, నేను మొదట వెళ్లి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా 22 యేసు అతని చూచి - నన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. 23 ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి. 24 అంతట సముద్రముమీద తుఫాను లేచినందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా 25 వారు ఆయన యొద్దకు వచ్చి - ప్రభువా, నశించుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. 26 అందుకాయన - అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. 27 వారాశ్చర్యపడి - ఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. 28 ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి 29 వారు - దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. 30 వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా 31 ఆ దయ్యములు - నీవు మమ్మును వెళ్లగొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. 32 ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందులలోకి పోయెను; అంతట ఆ మందంతయు ప్రపాతమునుండి సముద్రములోకి వడిగా పరుగెత్తుకొనిపోయి నీళ్లలోపడి చచ్చెను. Download Audio File
1 తరువాత ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా 2 జనులు పక్షవాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి - కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువుగలవానితో చెప్పెను. 3 అందుకు శాస్త్రులలో కొందరు - ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలోతాము అనుకొనగా 4 యేసు వారి తలంపులు గ్రహించి - మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? 5 నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా? 6 అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచి - నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ యింటికి పొమ్మని చెప్పగా 7-8. వాడు లేచి తన యింటికి వెళ్లెను జనులు అది చూచి భయపడి మనుష్యలకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి. 9 యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి - నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. 10 ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి. 11 పరిసయ్యులు అది చూచి - మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు బోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి. 12 ఆయన ఆ మాట విని - రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా. 13 అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు గనుక - కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను. అను వాక్యభావమేమిటో మీరు నేర్చుకొనబోవుడని చెప్పెను. 14 అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి - పరిసయ్యులును మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయురు; దీనికి హేతువేమని ఆయనను అడుగగా 15 యేసు - పెండ్లికుమారుడు తమతోకూడ నుండు కాలము పెండ్లి యింటివారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడుదినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. 16 ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు; వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపరచును చిరుగు మరి ఎక్కువగును. 17 మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు; పోసిన యెడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పెను. 18 ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి - నా కమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను. 19 యేసు లేచి అతనివెంట వెళ్లెను; ఆయన శిష్యులుకూడ వెళ్లిరి. 20 ఆ సమయమున, పన్నెండు సంవత్సరములనుండి రక్తస్రావ రోగము గల యొక స్త్రీ 21 - నేను ఆయన పై వస్త్రములు మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. 22 యేసు తిరిగి ఆమెను చూచి - కుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగుపడెను. 23 అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లనగ్రోవులు వాయించువారిని, జనసమూహము గొల్లు చేయుచుండుటను చూచి 24 - స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. 25 జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. 26 ఈ సమాచారము ఆ దేశమందంతట వ్యాపించెను. 27 యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంటవచ్చి - దావీదు కుమారుడా మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. 28 ఆయన యింట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు - నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారినడుగగా 29 వారు - నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి - మీ నమ్మికచొప్పున మీకు కలుగు గాక అని చెప్పినంతలో 30 వారి కన్నులు తెరువబడెను. అప్పుడు యేసు - ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. 31 అయినను వారు వెళ్లి ఆ దేశమంతట ఆయన కీర్తి ప్రచురము చేసిరి. 32 యేసును ఆయన శిష్యులును వెళ్లుచుండగా కొందరు, దయ్యము పట్టిన యొక మూగవాని ఆయన యొద్దకు తీసికొని వచ్చిరి. 33 దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి - ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనుబడలేదని చెప్పుకొనిరి. 34 అయితే పరిసయ్యులు - ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడనిరి. 35 యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్యసువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును వ్యాధిని స్వస్ధపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను. 36 ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొర్రెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి 37 - కోత విస్తారమే గాని పని వారు కొద్దిగా ఉన్నారు. 38 గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. Download Audio File
1 ఆయన తన పన్నెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చెను. 2 ఆ పన్నెండుమంది అపొస్తలుల పేళ్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను; మరియు అతని సహోదరుడగు అంద్రెయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, 3 ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరు గల లెబ్బయి, 4 కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. 5 యేసు ఆ పన్నెండు మందిని పంపివేయుచు, వారిని చూచి వారికాజ్ఞాపించినదేమనగా - మీరు అన్యజనుల దారిలోకి వెళ్లకుడి, సమరైయుల యే పట్టణములలోనైనను ప్రవేశింపకుడి గాని 6 ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెలయొద్దకే వెళ్లుడి. 7 వెళ్లుచు - పరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి. 8 రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. 9 మీ సంచులలో బంగారునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను కర్రనైనను సిద్దపరచుకొనకుడి; 10 పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా 11 మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లు వరకు అతని యింటనే బసచేయుడి. 12 ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి. 13 ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. 14 ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండినయెడల మీరు ఆ యిల్లయినను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. 15 విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వతగినదైయుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 16 ఇదిగో తోడేళ్లమధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులను పావురములవలె నిష్కపటులునై యుండుడి. 17 మనుష్యులను గూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహా సభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. 18 వీరికిని అన్యజనులకును సాక్ష్యార్ధమై నా నిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడదురు. 19 వారు మిమ్మును అప్పగించుచున్నప్పుడు, - ఏలాగు మాటలాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింపకుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహింపబడును. 20 మీ తండ్రి ఆత్మ మీలోఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడు వారు మీరు కారు. 21 సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు. 22 మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతము వరకు సహించినవాడు రక్షింపబడును. 23 వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 24 శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు. 25 శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జబూలని వారు పేరు పెట్టియుండినయెడల ఆయన యింటివారికి మరినిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా. 26 కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనదేదియు బయలుపరచబడక పోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. 27 చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రకటించుడి. 28 మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 29 రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు. 30-31. నీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్టులు. 32 మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రియెదుట నేను వానిని ఒప్పుకొందును. 33 మనుష్యులయెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనెరగనందును. 34 నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. 35 ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. 36 ఒక మనుష్యుని యింటివారే శత్రువులగుదురు. 37 తండ్రినైనను తల్లినైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; 38 తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. 39 తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. 40 మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. 41 ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. 42 మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
1 యేసు తన పన్నెండుమంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత యూదుల పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును తానున్నచోటనుండి వెళ్లిపోయెను. 2 క్రీస్తు చేయుచున్న కార్యములనుగూర్చి యోహాను చెరసాలలో విని - రాబోవువాడవు నీవేనా, మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా? 3 అని ఆయనను అడుగుటకు తన శిష్యులనంపెను. 4 యేసు వారిని చూచి -మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి 5 గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. 6 మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తరమిచ్చెను. 7 వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహానునుగూర్చి జనసమూహముతో ఈలాగు చెప్పసాగెను - మీరేమి చూచుటకు అరణ్యములోకి వెళ్లితిరి? గాలికి కదలింపబడిన రెల్లునా? మరి ఏమి చూడవెళ్లితిరి? 8 సన్నపుబట్టలు ధరించుకొనిన మనుష్యునా? ఇదిగో - సన్నపుబట్టలు ధరించుకొనినవారు రాజగృహములలో నుందురు గదా. 9 మరి ఏమి చూడవెళ్లితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. 10 ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును 11 స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడు. 12 బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇదివరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు. 13 యోహాను కాలము పర్యంతము ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుండెను. 14 ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే. 15 వినుటకు చెవులు గలవాడు వినునుగాక. 16-17. ఈ తరమువారిని దేనితో పోల్చుదును? సంతవీధులలో కూర్చునియుండి - మీకు పిల్లనగ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితిమి గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్లతో చెప్పి పిలుపులాటలాడు పిల్లకాయలను పొలియున్నారు. 18 యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక - వీడు దయ్యము పట్టినవాడని మీరనుచున్నారు. 19 మనుష్యకుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక - ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని మీరనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి2తీర్పుపొందుననెను. 20 పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైను అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారు మనస్సుపొందకపోవుటవలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. 21 - అయ్యో కొరాజీనా అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్బుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన పక్షమున ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొందియుందురు. 22 విమర్శ దినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. 23 కపెర్నహూమా, ఆకాశముమట్టుకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగిపోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన పక్షమున అది నేటివరకును నిలిచియుండును. 24 విమర్శదినమునందు నీ గతికంటె సొదొమదేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను. 25 ఆ సమయమున యేసు చెప్పినదేమనగా - తండ్రీ, ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచియున్నావని నిన్ను స్తుతించుచున్నాను. 26 అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. 27 సమస్తమును నా తండ్రిచేత నాకప్పగింపబడియున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను 28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తమైనవారలారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. 29 నేను సాత్వికుడను దీనమనస్సుగలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. 30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. Download Audio File
1 ఆ కాలమందు యేసు విశ్రాంతిదినమున పంటచేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. 2 పరిసయ్యులది చూచి - ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా 3 ఆయన వారితో ఇట్లనెను - తానును తనతోకూడనున్నవారును ఆకలిగొనియుండగా దావీదు చేసినదానిగూర్చి మీరు చదువలేదా? 4 అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులే తప్ప తానైనను తనతోకూడ ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. 5 మరియు యాజకులు విశ్రాంతిదినమున దేవాలయములో విశ్రాంతిదినమును ఉల్లంఘించియు నిర్దోషులై యున్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? 6 దేవాలయముకంటె గొప్పవాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను. 7 మరియు - కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరనుఅను వాక్య భావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోవుదురు. 8 కాగా మనుష్యుకుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువై యున్నాడనెను. 9 ఆయన అక్కడనుండి వెళ్లి వారి సమాజమందిరములో ప్రవేశించినప్పుడు, ఊచచెయ్యిగలవాడొకడు కనబడెను. 10 వారాయనమీద నేరము మోపవలెనని - విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. 11 అందుకాయన -మీలో ఏ మనుష్యునికైన నొక గొర్రె యుండి అది విశ్రాంతిదినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తియ్యడా? 12 గొర్రెకంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు : కాబట్టి విశ్రాంతిదినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి 13 ఆ మనుష్యునితో - నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యిచాపగా రెండవదానివలె అది బాగుపడెను. 14 అంతట పరిసయ్యులు వెలుపలికిపోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచనచేసిరి. 15 యేసు ఆ సంగతి తెలిసికొని అచ్చటనుండి వెళ్లిపోయెను. బహుజనులాయనను వెంబడింపగా 16 ఆయన వారినందరిని స్వస్థపరచి, తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. 17 ప్రవక్తయైన యెషయాద్వారా చెప్పినది నెరవేరునట్లు(ఆలాగు జరిగెను) అదేమనగా - 18 ఇదిగో ఈయన నా సేవకుడుఈయనను నేను ఏర్పరచుకొంటినిఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడుఈయనమీద నా ఆత్మనుంచెదనుఈయన అన్యజనులకు న్యాయవిధి ప్రచురము చేయును. 19 ఈయన జగడమాడడు కేకలువేయడువీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు 20 విజయమొందుటకున్యాయవిధిని ప్రబలింపజేయువరకుఈయన నలిగిన రెల్లును విరువడుపొగరాజెడు అవిసెనారను ఆర్పడు 21 ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే. 22 ఒక సమయమున, దయ్యముపట్టిన గుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయనయొద్దకు తేబడెను. ఆయన వాని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను. 23 అందుకు ప్రజలందరు విస్మయమొంది - ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. 24 పరిసయ్యులు ఆ మాట విని - వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకరివలన వెళ్లగొట్టుటలేదనిరి. 25 ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను - తనకుతానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు. 26 సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును? 27 నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్న పక్షమున మీ కుమారులు ఎవరివలన వాటిని వెళ్లగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులై యుందురు. 28 దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న పక్షమున నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. 29 ఒకడు మొదట బలవంతుని బంధించితేనే గాని యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును. 30 నా పక్షమున నుండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. 31 కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా - ప్రతి పాపమును దూషణయు మనుష్యులకు క్షమింపబడును గాని ఆత్మవిషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. 32 మనుష్యు కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ కలుగదు. 33 చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును. 34 సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా. 35 సజ్జనుడు తన మంచి ధననిధిలోనుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును. 36 నేను మీతో చెప్పునదేమనగా - మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును. 37 నీ మాటలనుబట్టి నీతిమంతుడని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు. 38 అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు - బోధకుడా, నీవలన ఒక సూచకక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను. 39 వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనాను గూర్చిన సుచకక్రియయే గాని మరి ఏ సూచకక్రియైన వారికి అనుగ్రహింపబడదు. 40 యోనా మూడు దివారాత్రులు తిమింగలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును. 41 నీనివెవారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనివెవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపనచేతురు. ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 42 విమర్శ సమయమున దక్షిణ దేశపురాణి యీ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపనచేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండి వచ్చెను; అయితే సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 43 అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతికోసరమై నీరులేని చోట్ల తిరుగుచుండును. 44 విశ్రాంతి దొరకనందున - నేను వదలి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని వచ్చి, ఆ యింట ఎవరును లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి, వెళ్లి తనకంటె చెడ్డవైన మరి యేడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును; అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. 45 అందుచేత ఆ మనుష్యుని కడపటిస్థితి మొదటిస్థితికంటె చెడ్డదగును. ఆలాగే యీ దుష్టతరమువారికిని సంభవించుననెను. 46 ఆయన జనసమూహముతో ఇంక మాటలాడుచుండగా ఆయన తల్లియు సహోదరులును ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. 47 అప్పుడొకడు - ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను. 48 అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవానిచూచి - నా తల్లి యెవరు? నా సహోదరు లెవరు? అని చెప్పి 49-50. తన శిష్యులవైపు చెయ్యి చాపి - ఇదిగో నా తల్లియు నా సహోదరులును; పరలోకమందున్న నా తండ్రి చిత్తముచొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లియునై యున్నాడనెను. Download Audio File
1 ఆదినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. 2 బహు జనసమూహములు తనయొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుండెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా 3 ఆయన వారిని చూచి అనేక సంగతులను ఉపమానరీతిగా చెప్పెను. ఎట్లనగా -ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. 4 వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను. 5 కొన్ని చాల మన్నులేని రాతి నేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని 6 సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. 7 కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. 8 కొన్ని మంచినేలను పడి, ఒకటి నూరంతలుగాను ఒకటి అరువదంతలుగాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను. 9 చెవులుగలవాడు వినునుగాక అనెను. 10 తరువాత శిష్యులు వచ్చి - నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను. 11 - పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి యున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. 12 కలిగినవానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసివేయబడును. మరియు - వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. 13-15. ఇందునిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచిచెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలనుస్వస్థతపొందకుండునట్లు వారి హృదయముక్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుకమీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు. అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. 1 16 అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక ధన్యములైనవి. 17 అనేక ప్రవక్తలును నీతిమంతులును మీరు చూచువాటిని చూడగోరి చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరి వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 18 విత్తువానిగూర్చిన ఉపమాన భావము వినుడి. 19 ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినది యెత్తికొనిపోవును; త్రోవప్రక్కను విత్తబడినవాడు వీడే. 20 రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు. 21 అయితే అతనిలో వేరులేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును. 22 ముండ్లపొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును వాక్యము నణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. 23 మంచినేలను విత్తబడినవాడైతే వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుదురనెను. 24 ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా-పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది. 25 మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమలమధ్యను గురుగులు విత్తిపోయెను. 26 మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడ అగుపడెను. 27 అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి - అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులెక్కడనుండి వచ్చినవని అడిగిరి 28 ఇది శత్రువు చేసినపని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు - మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. 29 అందుకతడు - వద్దు; గురుగులను పెరుకుచుండగా వాటితో కూడ ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. 30 కోతకాలమువరకు రెంటిని కలిసి యెదుగనియ్యుడి; కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్లతో చెప్పుదుననెను. 31 ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను -పరలోకరాజ్యము, ఒకడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. 32 అది విత్తనములన్నటిలో చిన్నదేగాని పెరిగినప్పుడు కూరమొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును. 33 ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను -పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టి పుల్లని పిండిని పోలియున్నది. 34 నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినసంగతులను తెలియజెప్పెదను 35 అని ప్రవక్త చెప్పినమాట2నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు. 36 అప్పుడాయన జనసమూహములను పంపివేసి తన యింటిలోకి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చి - పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుమనిరి. 37 అందుకాయన ఇట్లనెను -cf6 మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు; 38 పొలము లోకము; మంచి విత్తనములు రాజ్యసంబంధులు1; గురుగులు దుష్టుని సంబంధులు1; 39 వాటిని విత్తిన శత్రువు అపవాది2; కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు. 40 గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో ఆలాగే యుగసమాప్తియందు జరుగును. 41 మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి సకలమైన ఆటంకములను దుర్ణీతి చేయువారిని సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. 42 అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. 43 అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక. 44 పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. 45 పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది. 46 అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనెను. 47 పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. 48 అది నిండినప్పుడు దాని దరికి లాగి, కూర్చుండి, మంచివాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. 49 ఆ ప్రకారమే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి 50 వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును. 51 ఇవన్నియు మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు - గ్రహించితిమనిరి. 52 ఆయన -అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగాచేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలపలికి తెచ్చు ఇంటియజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను. 53 యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడనుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి సమాజమందిరములలో వారికి బోధించుచుండెను. 54 అందువలన వారాశ్చర్యపడి - ఈ జ్ఞానము ఈ అద్భుతములు ఇతనికెక్కడనుండి వచ్చినవి? 55 ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదా యనువారు ఇతని సహోదరులు కారా? 56 ఇతని అక్క చెల్లెండ్లందరు మనతోనే యున్నారు గదా; ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. 57 అయితే యేసు -ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. 58 వారి అవిశ్వాసమునుబట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. Download Audio File
1 ఆ సమయమందు చతుర్థాధిపతియైన హేరోదు యేసునుగూర్చిన సమాచారము విని 2 ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను; అతడు మృతులలోనుండి లేచియున్నాడు; అందువలననే అద్భుతములు అతనియందు క్రియాసాధకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. 3-4ఏలయనగా - నీవు నీ తమ్ముడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను చేర్చుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి యుండెను. 5 అతడు ఇతని చంప నుద్దేశించెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని యెంచినందున వారికి భయబడెను. 6 అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారిమధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను 7 గనుక - ఆమె ఏమి అడిగిన ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. 8 అప్పుడామె తన తల్లిచేత ప్రేరేపింపబడినదై - బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నాకిప్పించుడని యడిగెను. 9 రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతోకూడ భోజనమునకు కూర్చున్నవారి నిమిత్తమును ఇయ్య నాజ్ఞాపించి 10 బంట్రౌతులను పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. 11 వారతని తల పళ్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చిరి; ఆమె తన తల్లియొద్దకు దాని తీసికొని వచ్చెను. 12 అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తికొనిపోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి. 13 యేసు ఆ సంగతి విని దోనె యెక్కి అక్కడనుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను. జనసమూహములు ఆ సంగతి విని, పట్టణములనుండి కాలినడకను ఆయనవెంట వెళ్లిరి. 14 అయన వచ్చి ఆ గొప్పసమూహమును చూచి వారిమీద కనికరపడి వారిలో రోగులైనవారిని స్వస్థపరచెను. 15 సాయంకాలమైనప్పుడు శిష్యులాయనయొద్దకు వచ్చి - ఇది అరణ్యప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోకి వెళ్లి తమకు భోజనపదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయుమని చెప్పిరి. 16 యేసు -వారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా 17-18 వారు - ఇక్కడ మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన వాటిని నాయొద్దకు తెండని చెప్పి 19 పచ్చికమీద పంక్తిగా కూర్చుండుడని జనులకాజ్ఞాపించి, ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి. 20 వారందరు తిని తృప్తిపొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండ ఎత్తిరి. 21 స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు. 22 వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. 23 ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి సాయంకాలమైనప్పుడు అక్కడ ఒంటిగా ఉండెను. 24 అప్పటికాదోనె దరికి దూరమందుండగా గాలి యెదురైనందున అలలవలన కొట్టబడుచుండెను. 25 రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను. 26 ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి. 27 వెంటనే యేసు -ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా 28 పేతురు - ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. 29 ఆయన రమ్మనగానే పేతురు దోనె దిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని 30 గాలిని చూచి భయపడి మునిగిపోసాగి 31 ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను. వెంటనే యేసు చెయ్యిచచాపి అతని పట్టుకొని - అల్పవిశ్వాసి, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. 32 వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. 33 అంతట దోనేలో నున్నవారు వచ్చి-నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. 34-35. వారద్దరికి దాటి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులనందరిని ఆయన యొద్దకు తెప్పించి 36 - వీరిని నీ వస్త్రపుచెంగుమాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి; ముట్టినవారందరును స్వస్థతనొందిరి. Download Audio File
1 ఆ సమయమున యెరూషలేమునుండి శాస్త్రులును పరిసయ్యులును యేసునొద్దకు వచ్చి 2 - నీ శిష్యులు చేతులు కడుగకొనకుండ భోజనము చేయుచున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. 3 అందుకాయన - మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? 4 తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. 2 5 మీరైతే - ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి - నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితముని చెప్పినయెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. 6 మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. 7-9. వేషధారులారా -ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది;మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములనిబోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారుఅని యెషయామిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి 10 జనసమూహములను పిలిచి - మీరు విని గ్రహించుడి; 11 నోటపడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోటనుండి వచ్చునది మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. 12 అంతట ఆయన శిష్యులు వచ్చి - పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా 13 ఆయన - పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును. 14 వారి జోలికి పోకుడి; వారు గుడ్డివారైయుండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినయెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను. 15 అందుకు పేతురు - ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా 16 ఆయన - మీరును ఇంతవరకు అవివేకులై యున్నారా? 17 నోటిలోకి పోవునదంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని 18 నోటనుండి బయటికి వచ్చునవి హృదయములోనుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? 19 దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే గదా వచ్చును? 20 ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను. 21-22. యేసు అక్కడనుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా, ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చి - ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. 23 అందుకాయన ఆమెతో ఒక్క మాటయైన చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి - ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా 24 ఆయన - ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెలయొద్దకే నేను పంపబడితిని గాని మరి ఎవరియొద్దకును పంపబడలేదనెను. 25 అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి - ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. 26 అందుకాయన - పిల్లలరొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా 27 ఆమె - నిజము ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. 28 అందుకు యేసు - అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనొందెను. 29 యేసు అక్కడనుండి వెళ్లి గలిలైయ సముద్రతీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా 30 బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను. 31 మూగవారు మాటలాడుటయు అంగహీనులు బాగుపడుటయు కుంటివారు నడుచుటయు గుడ్డివారు చూచుటయు జనసమూహము చూచి ఆశ్యర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. 32 అంతట యేసు తన శిష్యులను పిలిచి - ఈ జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిననేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను; వారు మార్గములో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా 33 ఆయన శిష్యులు - ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి. 34 యేసు - మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారినడుగగా వారు - ఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి. 35 అప్పుడాయన - నేలమీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి 36 ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను, శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. 37 వారందరు తిని తృప్తిపొందినమీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి. 38 స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగు వేలమంది పురుషులు. 39 తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోనె యెక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను. Download Audio File
1 అప్పుడు పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను. 2 - సాయంకాలమున మీరు - ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురువదనియు, 3 ఉదయమున - ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశవైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేరు. 4 వ్యభిచారులైన చెడ్డతరమువారు సూచకక్రియ నడుగుచున్నారు; అయితే యోనాను గూర్చిన సూచక క్రియయేగాని మరి ఏ సూచక క్రియయైన వారికనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను. 5 ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. 6 అప్పుడు యేసు - చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడని వారితో చెప్పెను. 7 కాగా వారు - మనము రొట్టెలు తేనెందున గదా (యీ మాట చెప్పెనని) తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. 8 యేసు అది యెరిగి -అల్పవిశ్వాసులారా - మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? 9 మీరింక గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను 10 ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను మీకు జ్ఞాపకములేదా? 11 నేను రొట్టెలనుగూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చియే జాగ్రత్తపడుడని చెప్పెను. 12 అప్పుడు రొట్టెల పులిసిన పిండినిగూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధనుగూర్చియే జాగ్రత్తపడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి. 13 యేసు ఫిలిప్పుదైన కైసరైయ ప్రాంతములకు వచ్చి - మనుష్యకుమారుడెవడని జనులు చెప్పుకొనుచన్నారని తన శిష్యులను అడుగగా 14 వారు - కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. 15 అందుకాయన -మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారినడిగెను. 16 అందుకు సీమోను పేతురు -నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువనిచెప్పెను. 17 అందుకు యేసు -సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలు పరచెనేగాని నరులునీకు బయలుపరచలేదు. 18 మరియు నీవు పేతురువు, 2ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దానియెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. 19 పరలోకరాజ్యముయొక్క తాళపు చెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. 20 అటుపిమ్మట తాను క్రీస్తు అనియెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. 21 అప్పటినుండి, తాను యెరూషలేముకు వెళ్లి, పెద్దల చేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలుపొంది చంపబడి మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా 22 పేతురు ఆయనను ఒకవైపుకు తీసికొనిపోయి - ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దించెను. 23 అయితే ఆయన పేతురు వైపు తిరిగి - సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతరకారణమై యున్నావు; నీవు మనుష్యుల సంగతులనే మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకయున్నావని పేతురుతో చెప్పెను. 24 అప్పుడు యేసు తన శిష్యులను చూచి - ఎవడైనను నా వెంబడి రాగోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని తన సిలువ నెత్తికొని నన్ను వెంబడింపవలెను. 25 తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. 26 ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? 27 మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతోకూడ రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును. 28 ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచుపర్యంతము మరణము రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. Download Audio File
1 ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారియెదుట రూపాంతరము పొందెను. 2 ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు సూర్యకాంతివలె తెల్లనివాయెను. 3 మరియు మోషే ఏలీయా అనువారు ఆయనతో మాటలాడుచుండగా వారు చూచిరి. 4 అప్పుడు పేతురు - ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది; నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలీయాకు ఒకటి మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. 5 అతడు ఇంక మాటలాడుచుండగా ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; అప్పుడు - ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. 6 శిష్యులు ఈమాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా. 7 యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి -లెండి, భయపడకుడని చెప్పెను. 8 వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవడును వారికి కనబడలేదు. 9 వారు కొండదిగి వచ్చుచుండగా - మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరితోను చెప్పకుడని యేసు వారికాజ్ఞపించెను. 10 అప్పుడాయన శిష్యులు - ఈలాగైతే ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయననడిగిరి. 11 అందుకాయన - ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే; 12 అయినను ఏలీయా యిదివరకే వచ్చెను, వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతనికి చేసిరి. మనుష్యకుమారుడు కూడా ఆలాగే వారిచేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నాననెను. 13 అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యెహానునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. 14 వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయనయొద్దకు వచ్చి ఆయనయొదుట మెకాళ్లూని. 15 - ప్రభువా, నా కుమారుని కరుణింపుము; వాడు చాంద్రరోగియై మిక్కిలి బాధపడుచున్నాడు; ఏలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరుచుగా పడుచున్నాడు; 16 నీ శిష్యులయొద్దకు వానిని తీసికొని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. 17 అందుకు యేసు - విశ్వాసములేని మూర్ఖతరమువారలారా, నేనెంతకాలము మీతో ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వాని నాయొద్దకు తీసికొనిరండని చెప్పెను. 18 అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాని వదిలిపోయెను; ఆ గడియనుండి ఆ చిన్నవాడు స్వస్థతనొందెను; 19 తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి - మేమెందుచేతదాని వెళ్లగొట్టలేకపోతిమని అడిగిరి. 20-21. అందుకాయన - మీ అల్పవిశ్వాసముచేతనే; ఆవగింజంత విశ్వాసము మీకు కలిగియుండినయెడల ఈ కొండను చూచి - ఇక్కడనుండి అక్కడకి పొమ్మనగానే అది పోవును; మీకు అసాధ్యమైనది ఏదియునుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. 22 వారు గలిలైయలో సంచరించుచుండగా యేసు - మనుష్యకుమారుడు మనుష్యులచేతులకు అప్పగింపబడబోవుచున్నాడు, 23 వారాయనను చంపుదురు; మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దు :ఖపడిరి 24 వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకు వచ్చి - మీబోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అనియడగగా - చెల్లించుననెను. 25 అతడు ఇంటిలోకి వచ్చినప్పుడు అతడు మాటలాడక ముందుగా యేసు ఆ సంగతి యెత్తి -సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరియొద్ద వసూలు చేయుదురు? కుమారులయొద్దనా అన్యులయొద్దనా? అని అడిగెను. 26 అతడు - అన్యులయొద్దనే అని చెప్పగా యేసు - ఆలాగైతే కుమారులు స్వతంత్రులే. 27 అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండనట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకివచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచినయెడల ఒక షెకెలు దొరుకును; దాని తీసుకొని నాకొరకును నీకొరకును వారికిమ్మని అతనితో చెప్పను. Download Audio File
1-2. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోకరాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన యొక చిన్నబిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి యిట్లనెను. 3 - మీరు మనస్సు మార్పునొంది బిడ్డలవంటివారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 4 కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు. 5 మరియు ఈలాటి యొక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. 6 నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు తిరుగటి రాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. 7 అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పదు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. 8 కాగా నీ చెయ్యియైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము, రెండు చేతులైనను రెండు పాదములైనను కలిగినవాడవై నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె కుంటివాడవైనను అంగహీనుడవైనను జీవములో ప్రవేశించుట నీకు మేలు. 9 నీ కన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు కన్నులు గలవాడవై అగ్నిగల నరకములో పడవేయబడుటకంటె ఒంటి కన్నుగలవాడవై జీవములో ప్రవేశించుట నీకు మేలు. 10 ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖము ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. 11-12. 1మీకేమి తోచును? ఒక మనుష్యునికి నూరు గొర్రెలు కలిగియుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల తొంబదితొమ్మిదింటిని కొండలమీద విడిచి పోయి తప్పిపోయిన దానిని వెదకడా? 13 వాడు దాని కనుగొనుట తటస్థించినయెడల తొంబదితొమ్మిది గొర్రెలనుగూర్చి సంతోషించునంతకంటె దానినిగూర్చి యెక్కువగా సంతోషించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 14 ఆలాగున ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. 15 మరియు నీ సహోదరుడు నీయెడల తప్పితము చేసిన పక్షమున నీవు పోయి, నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతని గద్దించుము; అతడు నీ మాటవినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. 16 అతడు వినకపోయిన పక్షమున, ఇద్దరు ముగ్గురు సాక్షులనోట ప్రతిమాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దిరిని వెంటబెట్టుకొని పొమ్ము. 17 అతడు వారి మాటయు వినకపోయినపక్షమున ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాట వినకపోయెనా అతని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. 18 భూమిమీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 19 మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను ఏ సంగతిని గూర్చియైనను భూమిమీద ఏకీభవించిన పక్షమున అది పరలోకమందున్న నా తండ్రివలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. 20 ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యమ ఉందునని చెప్పెను. 21 ఆ సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి - ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పితము చేసినపక్షమున నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడుమారులమట్టుకా? అని అడిగెను. 22 అందుకు యేసు అతనితో ఇట్లనెను -ఏడుమారులమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను. 23 కావున పరలోకరాజ్యము, తన దాసులయొద్ద లెక్క చూచుకొనగోరిన యొక రాజును పోలియున్నది. 24 అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు1అచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను. 25 అప్పుతీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. 26 కాగా ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కి - నా యెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా 27 ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి ఆ అప్పు వానికి క్షమించెను. 28 అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు2అచ్చియున్న తన తోటిదాసులలో ఒకని చూచి వాని గొంతుక పట్టి - నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను. 29 అందుకు వాని తోటిదాసుడు సాగిలపడి - నాయెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వాని వేడుకొనెను గాని 30 వాడు ఒప్పకపోయి, అచ్చియున్నది చెల్లించుపర్యంతము వానిని చెరసాలలో వేయించెను. 31 కాగా వాని తోటిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి, వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. 32 అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి - చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక ఆ అప్పంతయు నీకు క్షమించితిని; 33 నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటిదాసుని కరుణింపవలసియుండెను గదా అని వానితో చెప్పెను. 34 అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించుపర్యంతము బాధపరచువారికి వాని నప్పగించెను. 35 మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల పరలోకపు నా తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయుననెను. Download Audio File