Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మత్తయి18వఅధ్యాయము

1-2. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోకరాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన యొక చిన్నబిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి యిట్లనెను. 
3  - మీరు మనస్సు మార్పునొంది బిడ్డలవంటివారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 
4  కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు. 
5  మరియు ఈలాటి యొక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. 
6  నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు తిరుగటి రాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. 
7  అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పదు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. 
8  కాగా నీ చెయ్యియైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము, రెండు చేతులైనను రెండు పాదములైనను కలిగినవాడవై నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె కుంటివాడవైనను అంగహీనుడవైనను జీవములో ప్రవేశించుట నీకు మేలు. 
9  నీ కన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు కన్నులు గలవాడవై అగ్నిగల నరకములో పడవేయబడుటకంటె ఒంటి కన్నుగలవాడవై జీవములో ప్రవేశించుట నీకు మేలు. 
10  ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖము ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. 
11-12. 1మీకేమి తోచును? ఒక మనుష్యునికి నూరు గొర్రెలు కలిగియుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల తొంబదితొమ్మిదింటిని కొండలమీద విడిచి పోయి తప్పిపోయిన దానిని వెదకడా? 
13  వాడు దాని కనుగొనుట తటస్థించినయెడల తొంబదితొమ్మిది గొర్రెలనుగూర్చి సంతోషించునంతకంటె దానినిగూర్చి యెక్కువగా సంతోషించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 
14  ఆలాగున ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. 
15  మరియు నీ సహోదరుడు నీయెడల తప్పితము చేసిన పక్షమున నీవు పోయి, నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతని గద్దించుము; అతడు నీ మాటవినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. 
16  అతడు వినకపోయిన పక్షమున, ఇద్దరు ముగ్గురు సాక్షులనోట ప్రతిమాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దిరిని వెంటబెట్టుకొని పొమ్ము. 
17  అతడు వారి మాటయు వినకపోయినపక్షమున ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాట వినకపోయెనా అతని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. 
18  భూమిమీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 
19  మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను ఏ సంగతిని గూర్చియైనను భూమిమీద ఏకీభవించిన పక్షమున అది పరలోకమందున్న నా తండ్రివలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. 
20  ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యమ ఉందునని చెప్పెను. 
21  ఆ సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి - ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పితము చేసినపక్షమున నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడుమారులమట్టుకా? అని అడిగెను. 
22  అందుకు యేసు అతనితో ఇట్లనెను -ఏడుమారులమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను. 
23  కావున పరలోకరాజ్యము, తన దాసులయొద్ద లెక్క చూచుకొనగోరిన యొక రాజును పోలియున్నది. 
24  అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు1అచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను. 
25  అప్పుతీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. 
26  కాగా ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కి - నా యెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా 
27  ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి ఆ అప్పు వానికి క్షమించెను. 
28  అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు2అచ్చియున్న తన తోటిదాసులలో ఒకని చూచి వాని గొంతుక పట్టి - నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను. 
29  అందుకు వాని తోటిదాసుడు సాగిలపడి - నాయెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వాని వేడుకొనెను గాని 
30  వాడు ఒప్పకపోయి, అచ్చియున్నది చెల్లించుపర్యంతము వానిని చెరసాలలో వేయించెను. 
31  కాగా వాని తోటిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి, వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. 
32  అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి - చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక ఆ అప్పంతయు నీకు క్షమించితిని; 
33  నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటిదాసుని కరుణింపవలసియుండెను గదా అని వానితో చెప్పెను. 
34  అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించుపర్యంతము బాధపరచువారికి వాని నప్పగించెను. 
35  మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల పరలోకపు నా తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయుననెను. 
Download Audio File

No comments:

Post a Comment