Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మత్తయి24వఅధ్యాయము

1  తరువాత యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా ఆయన శిష్యులు దాని కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి 
2  అందుకాయన - మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; పడద్రోయబడక రాతిమీద రాయి యొకటియైన ఇక్కడ నిలిచియుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను 
3  ఆయన ఒలీవ కొండమీద కూర్చునియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చి - ఇవి ఎప్పుడు జరుగును? నీ ఆగమనమునకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా 
4  యేసు వారితో ఇట్లనెను - ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి 
5  అనేకులు నా పేరట వచ్చి - నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు 
6  మరియు మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధసమాచారములనుగూర్చియు వినబోదురు; మీరు కలవలపడకుండ చూచుకొనుడి ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు 
7  జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును 
8  అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము 
9  అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామమునిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు 
10  అనేకులు అభ్యంతరపడి యొకనికొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు 
11  అనేకులైన అబద్ధప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు; 
12  అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును 
13  అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును 
14  మరియు ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును 
15  కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే - చదువువాడు గ్రహించు గాక - 
16  యూదైయలో ఉండువారు కొండలకు పారిపోవలెను 
17  ఇంటిమిద్దెమీద ఉండువాడు తన యింటిలోనుండి ఏదైనను తీసికొనిపోవుటకు దిగకూడదు; 
18  పొలములో ఉండువాడు తన బట్టలు తీసికొనిపోవుటకు ఇంటికి రాకూడదు 
19  అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ 
20  అప్పుడు మహా శ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి 
21  లోకసృష్టిమొదలుకొని యిదివరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు 
22  ఆ దినములు తక్కువ చేయబడక పోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును 
23  ఆ కాలమందు ఎవడైనను - ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మకుడి 
24  అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడినవారిన సహితము మోసపరచుటకై గొప్ప సూచకక్రియలను మహత్కార్యములను కనుపరచెదరు 
25  ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను 
26  కాబట్టి ఎవరైనను - ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి - ఇదిగో అంతఃపురములో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి 
27  మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని ఆగమనమును ఉండును 
28  పీనుగ ఎక్కడనున్నదో అక్కడ గద్దలు పోగవును 
29  ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతి ఇయ్యడు, నక్షత్రములు ఆకాశమునుండి రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును 
30  అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమిమీద ఉన్న సకల గోత్రములవారు రొమ్ముకొట్టుకొందురు 
31  మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశముయొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు 
32  అంజూరపు చెట్టువలన ఒక ఉపమానము నేర్చుకొనుడి అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వలంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియును 
33  ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు అది సమీపముననే ద్వారము దగ్గరనే యున్నదని తెలిసికొనుడి 
34  ఇవన్నియు జరుగు పర్యంతము ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను 
35  ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు 
36  అయితే ఆ దినమునుగూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును ) గాని యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు 
37  నోవహు దినములు ఏలాగుండెనో ఆలాగే మనుష్యకుమారుని ఆగమనమును ఉండును 
38  జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోకి వెళ్లిన దినమువరకు వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి 
39  జల ప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు పర్యంతము ఎరుగకపోయిరి, ఆలాగుననే మనుష్యకుమారుని ఆగమనమును ఉండును 
40  ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసికొని పోబడును ఒకడు విడిచి పెట్టబడును 
41  ఇద్దరు తిరుగలి విసురుచుందురు, ఒకతె తీసికొనిపోబడును ఒకతె విడిచిపెట్టబడును 
42  కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియుదు గనుక మెళకువగా నుండుడి 
43  ఏజామున దొంగ వచ్చునోయని యింటి యజమానునికి తెలిసియుండిన పక్షమున అతడు మెళకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు 
44  మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకయే మీరును సిద్ధముగా ఉండుడి 
45  యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? 
46  యజమానుడు వచ్చినప్పుడు ఎవడీలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు 
47  అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను 
48  అయితే దుష్టుడైన యొక దాసుడు - నా యజమానుడు ఆలస్యముచేయు చున్నాడని తన మనస్సులో అనుకొని 
49  తన తోటిదాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో కూడ తిని త్రాగుచుంటే 
50  ఆ దాసుడు కనిపెట్టని దినములలోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడ వాని పాలు నియమించును 
51  అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును. 
Download Audio File

No comments:

Post a Comment