Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మత్తయి28వఅధ్యాయము


 1  విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. 
2  ప్రభువు దూత పరలోకమునుండి దిగి వచ్చి రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను; అప్పుడు మహా భూకంపము కలిగెను. 
3  ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. 
4  అతనికి భయపడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి. 
5  దూత ఆ స్త్రీలను చూచి - మీరు భయపడకుడి, సిలువవేయబడిన యేసును మీరువెదకుచున్నారని నాకు తెలియును; 
6  ఆయన ఇక్కడలేడు; తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి 
7  త్వరగా వెళ్ళి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలైయలోకి మీకు ముందుగా వెళ్లుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను. 
8  వారు భయముతోను మహా ఆనందముతోను సమాధియొద్దనుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా 
9  యేసు వారిని ఎదుర్కొని -మీకు శుభమని చెప్పెను. వారు ఆయనయొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టి ఆయనకు మ్రొక్కగా 
10  యేసు - భయపడకుడి; మీరు వెళ్లి, నా సహూదరులు గలిలైయకు వెళ్లవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. 
11  వారు వెళ్లుచుండగా కావలివారు కొందరు పట్టణములోకి వచ్చి జరిగిన సంగతులన్నియు ప్రధానయాజకులతో చెప్పిరి. 
12  కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచనచేసి ఆ రాణువవారికి చాల ద్రవ్యమిచ్చి 
13  - మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొనిపోయిరని మీరు చెప్పుడి; 
14  ఇది ఆధిపతి చెవినిబడినయెడల మేము సమాధానపరచి మీకేమియు భయముతగలకుండ చేతుమని చెప్పిరి. 
15  అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమైయున్నది. 
16  పదకొండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలైయలోని కొండకు వెళ్లిరి. 
17  వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని కొందరు సందేహించిరి. 
18  అయితే యేసు వారియొద్దకువచ్చి - పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. 
19  కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోకి వారికి బాప్తిస్మమిచ్చును 
20  నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి పర్యంతము సదాకాలము మీతోకూడా ఉన్నానని వారితో చెప్పెను. 
Download Audio File

No comments:

Post a Comment