Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మత్తయి13వఅధ్యాయము

1  ఆదినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. 
2  బహు జనసమూహములు తనయొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుండెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా 
3  ఆయన వారిని చూచి అనేక సంగతులను ఉపమానరీతిగా చెప్పెను. ఎట్లనగా -ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. 
4  వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను. 
5  కొన్ని చాల మన్నులేని రాతి నేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని 
6  సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. 
7  కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. 
8  కొన్ని మంచినేలను పడి, ఒకటి నూరంతలుగాను ఒకటి అరువదంతలుగాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను. 
9  చెవులుగలవాడు వినునుగాక అనెను.  
10  తరువాత శిష్యులు వచ్చి - నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను. 
11  - పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి యున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. 
12  కలిగినవానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసివేయబడును. మరియు - వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. 
13-15. ఇందునిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచిచెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలనుస్వస్థతపొందకుండునట్లు వారి హృదయముక్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుకమీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు. అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. 1 
16  అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక ధన్యములైనవి. 
17  అనేక ప్రవక్తలును నీతిమంతులును మీరు చూచువాటిని చూడగోరి చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరి వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 
18  విత్తువానిగూర్చిన ఉపమాన భావము వినుడి. 
19  ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినది యెత్తికొనిపోవును; త్రోవప్రక్కను విత్తబడినవాడు వీడే. 
20  రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు. 
21  అయితే అతనిలో వేరులేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును. 
22  ముండ్లపొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును వాక్యము నణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. 
23  మంచినేలను విత్తబడినవాడైతే వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుదురనెను. 
24  ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా-పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది. 
25  మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమలమధ్యను గురుగులు విత్తిపోయెను. 
26  మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడ అగుపడెను. 
27  అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి - అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులెక్కడనుండి వచ్చినవని అడిగిరి 
28  ఇది శత్రువు చేసినపని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు - మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. 
29  అందుకతడు - వద్దు; గురుగులను పెరుకుచుండగా వాటితో కూడ ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. 
30  కోతకాలమువరకు రెంటిని కలిసి యెదుగనియ్యుడి; కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్లతో చెప్పుదుననెను.  
31  ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను -పరలోకరాజ్యము, ఒకడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. 
32  అది విత్తనములన్నటిలో చిన్నదేగాని పెరిగినప్పుడు కూరమొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును.  
33  ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను -పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టి పుల్లని పిండిని పోలియున్నది.  
34  నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినసంగతులను తెలియజెప్పెదను 
35  అని ప్రవక్త చెప్పినమాట2నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు. 
36  అప్పుడాయన జనసమూహములను పంపివేసి తన యింటిలోకి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చి - పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుమనిరి. 
37  అందుకాయన ఇట్లనెను -cf6 మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు; 
38  పొలము లోకము; మంచి విత్తనములు రాజ్యసంబంధులు1; గురుగులు దుష్టుని సంబంధులు1; 
39  వాటిని విత్తిన శత్రువు అపవాది2; కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు. 
40  గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో ఆలాగే యుగసమాప్తియందు జరుగును. 
41  మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి సకలమైన ఆటంకములను దుర్ణీతి చేయువారిని సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. 
42  అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. 
43  అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక. 
44  పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. 
45  పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది. 
46  అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనెను. 
47  పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. 
48  అది నిండినప్పుడు దాని దరికి లాగి, కూర్చుండి, మంచివాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. 
49  ఆ ప్రకారమే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి 
50  వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును. 
51  ఇవన్నియు మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు - గ్రహించితిమనిరి. 
52  ఆయన -అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగాచేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలపలికి తెచ్చు ఇంటియజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను. 
53  యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడనుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి సమాజమందిరములలో వారికి బోధించుచుండెను. 
54  అందువలన వారాశ్చర్యపడి - ఈ జ్ఞానము ఈ అద్భుతములు ఇతనికెక్కడనుండి వచ్చినవి? 
55  ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదా యనువారు ఇతని సహోదరులు కారా? 
56  ఇతని అక్క చెల్లెండ్లందరు మనతోనే యున్నారు గదా; ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. 
57  అయితే యేసు -ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. 
58  వారి అవిశ్వాసమునుబట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. 
Download Audio File

No comments:

Post a Comment