Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మత్తయి9వఅధ్యాయము

1  తరువాత ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా 
2  జనులు పక్షవాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి - కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువుగలవానితో చెప్పెను. 
3  అందుకు శాస్త్రులలో కొందరు - ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలోతాము అనుకొనగా 
4  యేసు వారి తలంపులు గ్రహించి - మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? 
5  నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా? 
6  అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచి - నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ యింటికి పొమ్మని చెప్పగా 
7-8. వాడు లేచి తన యింటికి వెళ్లెను జనులు అది చూచి భయపడి మనుష్యలకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి. 
9  యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి - నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. 
10  ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి. 
11  పరిసయ్యులు అది చూచి - మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు బోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి. 
12  ఆయన ఆ మాట విని - రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా. 
13  అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు గనుక - కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను. అను వాక్యభావమేమిటో మీరు నేర్చుకొనబోవుడని చెప్పెను. 
14  అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి - పరిసయ్యులును మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయురు; దీనికి హేతువేమని ఆయనను అడుగగా 
15  యేసు - పెండ్లికుమారుడు తమతోకూడ నుండు కాలము పెండ్లి యింటివారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడుదినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. 
16  ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు; వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపరచును చిరుగు మరి ఎక్కువగును. 
17  మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు; పోసిన యెడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పెను. 
18  ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి - నా కమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను. 
19  యేసు లేచి అతనివెంట వెళ్లెను; ఆయన శిష్యులుకూడ వెళ్లిరి. 
20  ఆ సమయమున, పన్నెండు సంవత్సరములనుండి రక్తస్రావ రోగము గల యొక స్త్రీ 
21  - నేను ఆయన పై వస్త్రములు మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. 
22  యేసు తిరిగి ఆమెను చూచి - కుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగుపడెను. 
23  అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లనగ్రోవులు వాయించువారిని, జనసమూహము గొల్లు చేయుచుండుటను చూచి 
24  - స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. 
25  జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. 
26  ఈ సమాచారము ఆ దేశమందంతట వ్యాపించెను. 
27  యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంటవచ్చి - దావీదు కుమారుడా మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. 
28  ఆయన యింట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు - నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారినడుగగా 
29  వారు - నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి - మీ నమ్మికచొప్పున మీకు కలుగు గాక అని చెప్పినంతలో 
30  వారి కన్నులు తెరువబడెను. అప్పుడు యేసు - ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. 
31  అయినను వారు వెళ్లి ఆ దేశమంతట ఆయన కీర్తి ప్రచురము చేసిరి. 
32  యేసును ఆయన శిష్యులును వెళ్లుచుండగా కొందరు, దయ్యము పట్టిన యొక మూగవాని ఆయన యొద్దకు తీసికొని వచ్చిరి. 
33  దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి - ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనుబడలేదని చెప్పుకొనిరి. 
34  అయితే పరిసయ్యులు - ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడనిరి. 
35  యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్యసువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును వ్యాధిని స్వస్ధపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను. 
36  ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొర్రెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి 
37  - కోత విస్తారమే గాని పని వారు కొద్దిగా ఉన్నారు. 
38  గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. 
Download Audio File

No comments:

Post a Comment