1 తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి
2 మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; ప్రవేశింపగానే కట్టబడియున్న యొక గాడిదెయు దానితోనున్న యొక గాడిదెపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి;
3 ఎవడైనను మీతో ఏమైనను అనినయెడల - అవి ప్రభువుకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను.
4 ప్రవక్తవలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అదేమనగా
5 ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదెనుభారవాహక పశువుపిల్లయైన చిన్నగాడిదెను ఎక్కినీయొద్దకు వచ్చుచున్నాడనిసీయోను కుమారితో చెప్పుడి అనునది.
6 శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి
7 ఆ గాడిదెను దాని పిల్లను తోలుకొనివచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను.
8 జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగున పరచిరి; కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగున పరచిరి.
9 జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును - దావీదు కుమారునికి జయముప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకసర్వోన్నతమైన స్థలములలో జయము. అని కేకలువేయుచుండిరి.
10 ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు - ఈయన ఎవరో అని కలవరపడెను.
11 జనసమూహము - ఈయన గలిలైయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.
12 యేసు దేవాలయములో ప్రవేశించి క్రయవిక్రయములు చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి -
13 నా మందిరము ప్రార్థన మందిరమనబడునుఅని వ్రాయబడియున్నది, 3అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను.
14 గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయనయొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను.
15 కాగా ప్రధానయాజకులును, శాస్త్రులును ఆయన చేసిన వింతలను, - దావీదు కుమారునికి జయము¬¬2అని దేవాలయములో చిన్న పిల్లలు కేకలు వేయటను చూచి కోపముతో మండిపడి
16 - వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు - వినుచున్నాను;బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోటస్త్రోత్రము సిద్ధింపజేసితివిఅను మాటమీరెన్నడును చదువలేదా అని వారితో చెప్పి
17 వారిని విడిచి పట్టణమునుండి బయలుదేరి బేతనియకు వెళ్లి అక్కడ బసచేసెను.
18 ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను.
19 అప్పుడు త్రోవప్రక్కను ఒంటిగా ఉన్న యొక అంజూరపుచెట్టును చూచి దాని యొద్దుకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దాని చూచి - ఇకమీదట ఎన్నటికిని నీవు కాపుకాయకుందువు గాక అని చెప్పెను; తత్క్షణమే ఆ అంజూరపుచెట్టు ఎండిపోయెను.
20 శిష్యులది చూచి ఆశ్చర్యపడి - అంజూరపు చెట్టు ఎంత శీఘ్రముగా ఎండిపోయెనని చెప్పుకొనిరి.
21 అందుకు యేసు -మీరు విశ్వాసముగలవారై సందేహపడకుండినయెడల ఈ కొండను చూచి - నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెడల ఆలాగు జరుగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
22 మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరికినవని) నమ్మిన పక్షమున మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.
23 ఆయన దేవాలయములోకి వచ్చి బోధించుచుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయన యొద్దకు వచ్చి - ఏ ఆధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని అడుగగా
24 - యేసు - నేనును మిమ్ము నొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును.
25 యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులవలన కలిగినదా? అని వారినడిగెను. వారు - మనము పరలోకమునుండి అని చెప్పితిమా, ఆయన - ఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనల నడుగును గదా;
26 మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము, అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని - మాకు తెలియదని యేసుకు ఉత్తరమిచ్చిరి.
27 అందుకాయన -ఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను.
28 మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి - కుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పనిచేయుమని చెప్పగా
29 వాడు - పోను అని ఉత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను.
30 అతడు రెండవవాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు - అయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ యిద్దరిలో ఎవడు తండ్రి యిష్టప్రకారము చేసినవాడని వారి నడిగెను.
31 అందుకు వారు - మొదటివాడే అనిరి. యేసు - సుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
32 యోహాను నీతిమార్గమున మీయొద్దకు వచ్చెను, మీరతని నమ్మలేదు; అయితే సుంకరులును వేశ్యలును అతని నమ్మిరి; మీరు అది చూచియు అతని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి.
33 మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి దాని చుట్టు కంచెవేయించి అందులో ద్రాక్షలతొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను.
34 పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసికొనివచ్చుటకు ఆ కాపులయొద్దకు తన దాసులనంపగా
35 ఆ కాపులు అతని దాసులను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి మరియొకనిమీద రాళ్వు రువ్విరి.
36 మరల అతడు మునపటికంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి.
37 తుదకు - నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారియొద్దకు పంపెను.
38 అయినను ఆ కాపులు కుమారుని చూచి - ఇతడు వారసుడు; ఇతని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలో తాము చెప్పుకొని
39 అతని పట్టుకొని ద్రాక్షతోటవెలుపల పడవేసి చంపిరి.
40 కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుల నేమిచేయుననెను.
41 అందుకు వారు - ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి, వాటివాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్షతోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి.
42 మరియు యేసు వారిని చూచి-ఇల్లు కట్టువారు నిషేధించిన రాయిమూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యముగా ఉన్నదిఅను మాట మీరు లేఖనములలోఎన్నడును చదువలేదా?
43 కాబట్టి దేవుని రాజ్యము మీయొద్దనుండి తొలిగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.
44 మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వాని నలిచేయుననెను.
45 ప్రధానయాజకులును, పరిసయ్యులును ఆయన చెప్పిన ఉపమానములను విని, తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి
46 ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరు ఆయనను ప్రవక్తయని యెంచిరి గనుక వారికి భయబడిరి.
Download Audio File

No comments:
Post a Comment