1 ఆ కాలమందు యేసు విశ్రాంతిదినమున పంటచేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి.
2 పరిసయ్యులది చూచి - ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా
3 ఆయన వారితో ఇట్లనెను - తానును తనతోకూడనున్నవారును ఆకలిగొనియుండగా దావీదు చేసినదానిగూర్చి మీరు చదువలేదా?
4 అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులే తప్ప తానైనను తనతోకూడ ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను.
5 మరియు యాజకులు విశ్రాంతిదినమున దేవాలయములో విశ్రాంతిదినమును ఉల్లంఘించియు నిర్దోషులై యున్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా?
6 దేవాలయముకంటె గొప్పవాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను.
7 మరియు - కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరనుఅను వాక్య భావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోవుదురు.
8 కాగా మనుష్యుకుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువై యున్నాడనెను.
9 ఆయన అక్కడనుండి వెళ్లి వారి సమాజమందిరములో ప్రవేశించినప్పుడు, ఊచచెయ్యిగలవాడొకడు కనబడెను.
10 వారాయనమీద నేరము మోపవలెనని - విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి.
11 అందుకాయన -మీలో ఏ మనుష్యునికైన నొక గొర్రె యుండి అది విశ్రాంతిదినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తియ్యడా?
12 గొర్రెకంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు : కాబట్టి విశ్రాంతిదినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి
13 ఆ మనుష్యునితో - నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యిచాపగా రెండవదానివలె అది బాగుపడెను.
14 అంతట పరిసయ్యులు వెలుపలికిపోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచనచేసిరి.
15 యేసు ఆ సంగతి తెలిసికొని అచ్చటనుండి వెళ్లిపోయెను. బహుజనులాయనను వెంబడింపగా
16 ఆయన వారినందరిని స్వస్థపరచి, తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఆజ్ఞాపించెను.
17 ప్రవక్తయైన యెషయాద్వారా చెప్పినది నెరవేరునట్లు(ఆలాగు జరిగెను) అదేమనగా -
18 ఇదిగో ఈయన నా సేవకుడుఈయనను నేను ఏర్పరచుకొంటినిఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడుఈయనమీద నా ఆత్మనుంచెదనుఈయన అన్యజనులకు న్యాయవిధి ప్రచురము చేయును.
19 ఈయన జగడమాడడు కేకలువేయడువీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు
20 విజయమొందుటకున్యాయవిధిని ప్రబలింపజేయువరకుఈయన నలిగిన రెల్లును విరువడుపొగరాజెడు అవిసెనారను ఆర్పడు
21 ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే.
22 ఒక సమయమున, దయ్యముపట్టిన గుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయనయొద్దకు తేబడెను. ఆయన వాని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను.
23 అందుకు ప్రజలందరు విస్మయమొంది - ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి.
24 పరిసయ్యులు ఆ మాట విని - వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకరివలన వెళ్లగొట్టుటలేదనిరి.
25 ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను - తనకుతానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు.
26 సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?
27 నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్న పక్షమున మీ కుమారులు ఎవరివలన వాటిని వెళ్లగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులై యుందురు.
28 దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న పక్షమున నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది.
29 ఒకడు మొదట బలవంతుని బంధించితేనే గాని యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును.
30 నా పక్షమున నుండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.
31 కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా - ప్రతి పాపమును దూషణయు మనుష్యులకు క్షమింపబడును గాని ఆత్మవిషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు.
32 మనుష్యు కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ కలుగదు.
33 చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును.
34 సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.
35 సజ్జనుడు తన మంచి ధననిధిలోనుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.
36 నేను మీతో చెప్పునదేమనగా - మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.
37 నీ మాటలనుబట్టి నీతిమంతుడని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.
38 అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు - బోధకుడా, నీవలన ఒక సూచకక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను.
39 వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనాను గూర్చిన సుచకక్రియయే గాని మరి ఏ సూచకక్రియైన వారికి అనుగ్రహింపబడదు.
40 యోనా మూడు దివారాత్రులు తిమింగలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును.
41 నీనివెవారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనివెవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపనచేతురు. ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
42 విమర్శ సమయమున దక్షిణ దేశపురాణి యీ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపనచేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండి వచ్చెను; అయితే సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
43 అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతికోసరమై నీరులేని చోట్ల తిరుగుచుండును.
44 విశ్రాంతి దొరకనందున - నేను వదలి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని వచ్చి, ఆ యింట ఎవరును లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి, వెళ్లి తనకంటె చెడ్డవైన మరి యేడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును; అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును.
45 అందుచేత ఆ మనుష్యుని కడపటిస్థితి మొదటిస్థితికంటె చెడ్డదగును. ఆలాగే యీ దుష్టతరమువారికిని సంభవించుననెను.
46 ఆయన జనసమూహముతో ఇంక మాటలాడుచుండగా ఆయన తల్లియు సహోదరులును ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచియుండిరి.
47 అప్పుడొకడు - ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను.
48 అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవానిచూచి - నా తల్లి యెవరు? నా సహోదరు లెవరు? అని చెప్పి
49-50. తన శిష్యులవైపు చెయ్యి చాపి - ఇదిగో నా తల్లియు నా సహోదరులును; పరలోకమందున్న నా తండ్రి చిత్తముచొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లియునై యున్నాడనెను.
Download Audio File

No comments:
Post a Comment