1 ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి
2 - పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదైయ అరణ్యములో ప్రకటించుచుండెను.
3 ప్రభువు మార్గము సిద్ధపరచుడిఆయన త్రోవలు సరాళము చేయుడనిఅరణ్యములో కేకవేయు ఒకని శబ్దముఅని ప్రవక్తయైన యెషయా ద్వారాచెప్పబడినవాడితడే
4 ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారమై యుండెను.
5 ఆ సమయమున యెరూషలేమువారును యూదైయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును అతనియొద్దకు వచ్చి
6 తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి.
7 అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి - సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు?
8 మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి.
9 అబ్రాహాము మాకు తండ్రి ఆని మీలో మీరు చెప్పుకొన తలచవద్దు; దేవుడు ఈరాళ్ళవలన అబ్రాహాముకు పిల్లలను పుట్టి0పగలడని మీతో చెప్పుచున్నాను.
10 ఇప్పుడే గోడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతిచెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.
11 మారుమనస్సునిమిత్తము నేను నీళ్ళలోమీకు బాప్తిస్మమిచ్చుచున్నాను;అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైన నేనుపాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోనుఅగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును.
12 ఆయన, చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి గోధుమలను కొట్టులో పోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని చెప్పెను.
13 ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలైయనుండి యొర్దాను దగ్గరనున్న అతనియొద్దకు వచ్చెను.
14 అందుకు యోహాను - నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింప చూచెను గాని
15 యేను - ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను.
16 యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డుకు వచ్చెను; అప్పుడు ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తన మీదికి వచ్చుట చూచెను.
17 మరియు - ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
Download Audio File

No comments:
Post a Comment