Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మత్తయి8వఅధ్యాయము

1  ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. 
2  అప్పుడొక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి - ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. 
3  అందుకాయన చెయ్యిచాపి వాని ముట్టి - నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తత్క్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను.  
4  అప్పుడు యేసు - ఎవరితోను చెప్పక నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను.  
5  ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి 
6  - ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. 
7  యేసు - నేను వచ్చి వాని స్వస్ధపరచెదననిఅతనితో చెప్పగా 
8  ఆ శతాధిపతి - ప్రభువా, నీవు నా యింటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. 
9  నేను కూడ అధికారమునకు లోబడినవాడును; నా చేతిక్రింద రాణువవారున్నారు; నేనొకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. 
10  యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచి - ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 
11  అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను ఇస్సాకుతోకూడను యాకోబుతోకూడను పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని 
12  రాజ్యసంబంధులువెలుపట చీకటిలోకి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.  
13  అంతట యేసు - ఇక వెళ్లుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతనొందెను.  
14  తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి 
15  ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను; అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. 
16  సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. 
17  ఆయన మాటవలన దయ్యములను వెళ్లగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను 
18  యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్లవలెనని ఆజ్ఞాపించెను. 
19  అంతట ఒక శాస్త్రి వచ్చి - బోధకుడా, నీవెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను. 
20  అందుకు యేసు - నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుటకైన స్థలము లేదని అతనితో చెప్పెను. 
21  శిష్యులలో మరియొకడు - ప్రభువా, నేను మొదట వెళ్లి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా 
22  యేసు అతని చూచి - నన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను.  
23  ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి. 
24  అంతట సముద్రముమీద తుఫాను లేచినందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా 
25  వారు ఆయన యొద్దకు వచ్చి - ప్రభువా, నశించుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. 
26  అందుకాయన - అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను.  
27  వారాశ్చర్యపడి - ఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. 
28  ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి 
29  వారు - దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. 
30  వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా 
31  ఆ దయ్యములు - నీవు మమ్మును వెళ్లగొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. 
32  ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందులలోకి పోయెను; అంతట ఆ మందంతయు ప్రపాతమునుండి సముద్రములోకి వడిగా పరుగెత్తుకొనిపోయి నీళ్లలోపడి చచ్చెను. 
Download Audio File

No comments:

Post a Comment