Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మత్తయి19వఅధ్యాయము

1  యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలైయనుండి యొర్దాను అద్దిరనున్న యూదైయ ప్రాంతములకు వచ్చెను. 
2  బహు జనసమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. 
3  పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి - పురుషుడు ఏ హేతువుచేతనైనను తన భార్యను విడనాడుట న్యాయమా? అని అడుగగా 
4  ఆయన - సృష్టించినవాడు ఆదినుండి వారిని పురుషుని గాను స్త్రీనిగాను సృష్టించి 
5  - ఇందునిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెనని3మీరు చదువలేదా? 
6  కాబట్టి వారికను ఇద్దరు కాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. 
7  అందుకు వారు - ఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా 
8  ఆయన - మోషే మీ హృదయకాఠిన్యమునుబట్టి మీ భార్యలను విడనాడ సెలవిచ్చెను గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు. 
9  మరియు వ్యభిచారమునిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనినవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనినవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో ననెను. 
10  ఆయన శిష్యులు - భార్యభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లిచేసికొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. 
11  అందుకాయన - అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. 
12  తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలురు, పరలోకరాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులును గలరు. (ఈ మాటను) అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను. 
13  అప్పుడు ఆయన వారిమీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. 
14  ఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దింపగా యేసు - చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పి 
15  వారిమీద చేతులుంచి, అక్కడనుండి లేచిపోయెను. 
16  అంతట ఒకడు వచ్చి - బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచికార్యము చేయవలెనని ఆయనను అడిగెను. 
17  అందుకాయన - మంచి కార్యమునుగూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింప గోరినయెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు - ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా 
18  యేసు - నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రులను సన్మానింపుము, 
19  నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను. 
20  అందుకు ఈ యౌవనస్థుడు - ఇవన్నియు అనుసరించుచునే యున్నాను; ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. 
21  అందుకు యేసు -పరిపూర్ణుడవగుటకు నీవు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును;నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. 
22  అయితే ఆ యౌవనస్థుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లిపోయెను. 
23  యేసు తన శిష్యులను చూచి - ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుట దుర్లభమని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 
24  ఇదియుగాక ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుటకంటె సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను. 
25  శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి - ఈలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా 
26  యేసు వారిని చూచి - ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. 
27  పేతురు - ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా 
28  యేసు వారితో ఇట్లనెను -(ప్రపంచ) పునర్జన్మమందుమనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పన్నెండు గోత్రములవారికి తీర్పు తీర్చుదురు. 
29  నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్లనైనను తండ్రినైనను తలినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు నూరురెట్లు పొందును; ఇదియుగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును. 
30  మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. 
Download Audio File

No comments:

Post a Comment