1 ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయనయొద్దకు వచ్చిరి.
2 అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను -
3 ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
4 దుఃపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
5 సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
6 నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.
7 కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.
8 హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
9 సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు.
10 నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
11 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
12 సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
13 మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకేగాని మరి దేనికిని పనికిరాదు.
14 మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు.
15 మనుష్యులు దీపము వెలిగించి కుంచముక్రింద పెట్టరు గాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు.
16 మనుష్యులు మీ సత్ క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.
17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల (వచనముల) నైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.
18 ఆకాశమును భూమియు గతించిపోతేనే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
19 కాబట్టి యీ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో గొప్పవాడనబడును.
20 శాస్త్రుల నీతికంటెను పరిశయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను.
21 నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులలో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
22 నేను మీతో చెప్పునదేమనగా - తన సహోదరునిమీదకోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు సభకు లోనగును;ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.
23 కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన పక్షమున
24 అక్కడ బలిపీఠము ఎదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము అర్పింపుము.
25 నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.
26 కడపటి కాసు చెల్లించువరకు అక్కడనుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
27 వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా;
28 నేను మీతో చెప్పునదేమనగా - ఒక స్త్రీని మోహపుచుపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
29 నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయును; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా.
30 నీ కుడిచెయ్యి నిన్ను అభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా.
31 తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగపత్రికను ఇయ్యవలెనని చెప్పబడియున్నది గదా;
32 నేను మీతో చెప్పునదేమనగా - వ్యభిచార కారణమునుబట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదాని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు.
33 మరియు - నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా;
34 నేను మీతో చెప్పునదేమనగా - ఎంతమాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు; ఆకాశము తోడని వద్దు, అది దేవుని సింహాసనము;
35 భూమి తోడని వద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడని వద్దు, అది మహారాజు పట్టణము.
36 నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు.
37 మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని యుండవలెను; వీటిని మించునది దుష్టునినుండిపుట్టునది.
38 కంటికి కన్ను పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
39 నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.
40 ఎవడైన నీమీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసికొనగోరినయెడల వానికి నీ పై వస్త్రముకూడ ఇచ్చివేయుము.
41 ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల వానితోకూడ రెండు మైళ్లు వెళ్లుము.
42 నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువానినుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు.
43 నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా;
44 నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించువారికొరకు ప్రార్ధన చేయుడి.
45 ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.
46 మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా.
47 మీ సహోదరులకు మాత్రమే వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా.
48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
Download Audio File

No comments:
Post a Comment