Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మత్తయి23వఅధ్యాయము

1  అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను 
2  - శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు 
3  గనుక - వారు మీతో చెప్పువాటినన్నటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు 
4  మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు 
5  మనుష్యులకు కనబడు నిమిత్తము తమ క్రియలన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు; 
6  విందులలో అగ్రస్థానములను సమాజమందిరములలో అగ్రపీఠములను 
7  సంతవీధులలో వందనములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు 
8  మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు మీరందరు సహోదరులు 
9  మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు 
10  మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు 
11  మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను 
12  తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును 
13  అయ్యో, వేషధారులైను శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు; మీరందులో ప్రవేశింపరు ప్రవేశించువారిని ప్రవేశింపనియ్యరు 
14  అయ్యో, వేషధారులైను శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు; మీరందులో ప్రవేశింపరు ప్రవేశించువారిని ప్రవేశింపనియ్యరు 
15  అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని సంచరింతురు అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరకపాత్రునిగా1చేయుదురు 
16  అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొంటే అందులో ఏమియు లేదుగాని దేవాలయములోని బంగారము తోడని ఒట్టుపెట్టుకొంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు 
17  అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? 
18  మరియు - బలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటే అందులో ఏమియు లేదు గాని దాని పైనుండు అర్పణము తోడని ఒట్టుపెట్టుకొంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు 
19  అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? 
20  బలిపీఠముతోడని ఒట్టుపెట్టుకొనువాడు దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటితోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు 
21  మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకొనువాడు దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు 
22  మరియు ఆకాశము తోడని ఒట్టుపెట్టుకొనువాడు దేవుని సంహాసనముతోడనియు దానిపైని కూర్చున్నవాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు 
23  అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదియవవంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును (కనుపరచక ) విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసియుండెను 
24  అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండ వడియగట్టి ఒంటెను మ్రింగువారు మీరే 
25  అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురు గాని అవి లోపట దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి 
26   
27  అయ్యో, వేషధారలైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలియున్నారు అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్తమైన కల్మషముతోను నిండియున్నవి 
28  ఆలాగే మీరు వెలపల మనుష్యులకు నీతిమంతులుగా నగుపడుచున్నారు గాని లోపల వేషధారణతోను అక్రమముతోను నిండియున్నారు 
29  అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు 
30  - మనము మన2పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో 3వారితో పాలివారమై యుండకపోదుమని చెప్పుకొందురు 
31  అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులైయున్నారని మీమీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు 
32  మీరును మీ పితరుల పరిమాణము పూర్తిచేయుడి 
33  సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీరేలాగు తప్పించుకొందురు? 
34  అందుచేత నేను మీయొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతో కొట్టి పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు 
35  నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును గర్భాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయకుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీమీదికి వచ్చును 
36  ఇవన్నియు ఈ తరమువారిమీదికి వచ్చునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను 
37  యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో రువ్వుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కలక్రిందికేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి 
38  ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది 
39  ఇది మొదలుకొని - ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడు గాకని మీరు చెప్పు పర్యంతము నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. 
Download Audio File

No comments:

Post a Comment