Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, August 16, 2013

మత్తయి17వఅధ్యాయము

1  ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారియెదుట రూపాంతరము పొందెను. 
2  ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు సూర్యకాంతివలె తెల్లనివాయెను. 
3  మరియు మోషే ఏలీయా అనువారు ఆయనతో మాటలాడుచుండగా వారు చూచిరి. 
4  అప్పుడు పేతురు - ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది; నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలీయాకు ఒకటి మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. 
5  అతడు ఇంక మాటలాడుచుండగా ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; అప్పుడు - ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. 
6  శిష్యులు ఈమాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా. 
7  యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి -లెండి, భయపడకుడని చెప్పెను. 
8  వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవడును వారికి కనబడలేదు. 
9  వారు కొండదిగి వచ్చుచుండగా - మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరితోను చెప్పకుడని యేసు వారికాజ్ఞపించెను. 
10  అప్పుడాయన శిష్యులు - ఈలాగైతే ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయననడిగిరి. 
11  అందుకాయన - ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే; 
12  అయినను ఏలీయా యిదివరకే వచ్చెను, వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతనికి చేసిరి. మనుష్యకుమారుడు కూడా ఆలాగే వారిచేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నాననెను. 
13  అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యెహానునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. 
14  వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయనయొద్దకు వచ్చి ఆయనయొదుట మెకాళ్లూని. 
15  - ప్రభువా, నా కుమారుని కరుణింపుము; వాడు చాంద్రరోగియై మిక్కిలి బాధపడుచున్నాడు; ఏలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరుచుగా పడుచున్నాడు; 
16  నీ శిష్యులయొద్దకు వానిని తీసికొని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. 
17  అందుకు యేసు - విశ్వాసములేని మూర్ఖతరమువారలారా, నేనెంతకాలము మీతో ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వాని నాయొద్దకు తీసికొనిరండని చెప్పెను. 
18  అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాని వదిలిపోయెను; ఆ గడియనుండి ఆ చిన్నవాడు స్వస్థతనొందెను; 
19  తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి - మేమెందుచేతదాని వెళ్లగొట్టలేకపోతిమని అడిగిరి. 
20-21. అందుకాయన - మీ అల్పవిశ్వాసముచేతనే; ఆవగింజంత విశ్వాసము మీకు కలిగియుండినయెడల ఈ కొండను చూచి - ఇక్కడనుండి అక్కడకి పొమ్మనగానే అది పోవును; మీకు అసాధ్యమైనది ఏదియునుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. 
22  వారు గలిలైయలో సంచరించుచుండగా యేసు - మనుష్యకుమారుడు మనుష్యులచేతులకు అప్పగింపబడబోవుచున్నాడు, 
23  వారాయనను చంపుదురు; మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దు :ఖపడిరి 
24  వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకు వచ్చి - మీబోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అనియడగగా - చెల్లించుననెను. 
25  అతడు ఇంటిలోకి వచ్చినప్పుడు అతడు మాటలాడక ముందుగా యేసు ఆ సంగతి యెత్తి -సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరియొద్ద వసూలు చేయుదురు? కుమారులయొద్దనా అన్యులయొద్దనా? అని అడిగెను. 
26  అతడు - అన్యులయొద్దనే అని చెప్పగా యేసు - ఆలాగైతే కుమారులు స్వతంత్రులే. 
27  అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండనట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకివచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచినయెడల ఒక షెకెలు దొరుకును; దాని తీసుకొని నాకొరకును నీకొరకును వారికిమ్మని అతనితో చెప్పను. 
Download Audio File

No comments:

Post a Comment