1 యేసు తన పన్నెండుమంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత యూదుల పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును తానున్నచోటనుండి వెళ్లిపోయెను.
2 క్రీస్తు చేయుచున్న కార్యములనుగూర్చి యోహాను చెరసాలలో విని - రాబోవువాడవు నీవేనా, మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా?
3 అని ఆయనను అడుగుటకు తన శిష్యులనంపెను.
4 యేసు వారిని చూచి -మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి
5 గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.
6 మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తరమిచ్చెను.
7 వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహానునుగూర్చి జనసమూహముతో ఈలాగు చెప్పసాగెను - మీరేమి చూచుటకు అరణ్యములోకి వెళ్లితిరి? గాలికి కదలింపబడిన రెల్లునా? మరి ఏమి చూడవెళ్లితిరి?
8 సన్నపుబట్టలు ధరించుకొనిన మనుష్యునా? ఇదిగో - సన్నపుబట్టలు ధరించుకొనినవారు రాజగృహములలో నుందురు గదా.
9 మరి ఏమి చూడవెళ్లితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.
10 ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును
11 స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడు.
12 బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇదివరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు.
13 యోహాను కాలము పర్యంతము ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుండెను.
14 ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.
15 వినుటకు చెవులు గలవాడు వినునుగాక.
16-17. ఈ తరమువారిని దేనితో పోల్చుదును? సంతవీధులలో కూర్చునియుండి - మీకు పిల్లనగ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితిమి గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్లతో చెప్పి పిలుపులాటలాడు పిల్లకాయలను పొలియున్నారు.
18 యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక - వీడు దయ్యము పట్టినవాడని మీరనుచున్నారు.
19 మనుష్యకుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక - ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని మీరనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి2తీర్పుపొందుననెను.
20 పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైను అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారు మనస్సుపొందకపోవుటవలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను.
21 - అయ్యో కొరాజీనా అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్బుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన పక్షమున ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొందియుందురు.
22 విమర్శ దినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.
23 కపెర్నహూమా, ఆకాశముమట్టుకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగిపోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన పక్షమున అది నేటివరకును నిలిచియుండును.
24 విమర్శదినమునందు నీ గతికంటె సొదొమదేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.
25 ఆ సమయమున యేసు చెప్పినదేమనగా - తండ్రీ, ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచియున్నావని నిన్ను స్తుతించుచున్నాను.
26 అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.
27 సమస్తమును నా తండ్రిచేత నాకప్పగింపబడియున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను
28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తమైనవారలారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
29 నేను సాత్వికుడను దీనమనస్సుగలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును.
30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.
Download Audio File

No comments:
Post a Comment